తేదీలు-సంఘటనలు
అంతర్జాతీయం
-సెప్టెంబర్ 8 ః చైనా త్వరలో ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విద్యావిధానంపై హాంకాంగ్‌లో నిరసన వ్యక్తం అయింది.
-సెప్టెంబర్ 11 ః ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాను క్యూఎస్ విడుదల చేసింది. తొలి స్థానంలో అమెరి కాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. కేంబ్రిడ్జి రెండో స్థానాన్ని దక్కించుకుంది.
-సెప్టెంబర్ 12 ః అమెరికాలో రూపొందిన ఒక సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందంటూ ఒక వర్గం లిబియాలోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి చేసింది. ఈ ఘటనలో అమెరికా రాయభారి క్రిస్టోఫర్ స్టివెన్స్‌లీతో పాటు మరో ముగ్గురు మృతిచెందారు
జాతీయం
-సెప్టెంబర్ 8 ః భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు చర్చలు ఇస్లామాబాద్‌లో ప్రారంభం అయ్యాయి. వీసా నిబంధనలు సరళతరం చేయాలని నిర్ణయించారు.
-సెప్టెంబర్ 9 ః క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ కన్నుమూశారు. ప్రస్తుతం రూ 1300 కోట్ల టర్నోవర్‌తో లాభాల బాటలో కొనసాగుతున్న అమూల్ సంస్థ ఆయన కృషి మూలంగానే ప్రారంభం అయి ఎదిగింది. పాలకు కూడా ఒకప్పుడు దిగుమ తులపైనే ఆధారపడ్డ దేశాన్ని ఒయన సహకార సంఘాల సమాఖ్యాల ఏర్పాటుతో ఎగుమతులు చేసే స్థాయికి తీసుకె ళ్లారు. ఆసియా పాల ఉత్పత్తిలో ప్రస్తుతం భారతదేశం వాటా 17%గా ఉండడం ఆయన కృషికి నిదర్శనం.
-సెప్టెంబర్ 11 ః కరవు రాష్ట్రాలలో ఉపాధి హామీ పనుల నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. పనులను ఏడాదికి 150 రోజులకు పెంచడంతో పాటు ఆయా ప్రాంతాలలో టర్మ్ రుణాలుగా రీషెడ్యూల్ చేసిన పంటరుణాల వడ్డీ రేట్లను ఈ ఏడాది మేరకు 12% నుంచి 7% తగ్గించారు.
-సెప్టెంబర్ 12 ః దేశ ద్రోహం నేరం కింద జైలు పాలయిన కార్టూనిస్ట్ ఆసీమ్ త్రివేది విడుదల అయ్యారు. ముంబాయి హైకోర్ట్ ఆదేశాల మేరకు ఆయనను విడుదల చేశారు.
-సెప్టెంబర్ 13 ః సమాచార హక్కు చట్టానికి సంబంధించి సుప్రీంకోర్ట్ కీలక తీర్పును ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సమాచార కమిషన్లకు నేతృత్వం వహించే వారు సుప్రీం లేదా హైకోర్ట్ (మాజీ లేదా ప్రస్తుతం) న్యాయమూర్తులనే నియమించాలని సూచించింది. అలాగే సభ్యుల నియామకంలోను కొన్ని మార్పులు చేసింది.
-సెప్టెంబర్ 14 ః బొగ్గు గనుల కేటాయింపులో నిబంధనలు ఏ మేరకు పాటించారో తమకు తెలుపాలంటూ సుప్రీంకోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రీయం
-సెప్టెంబర్ 8 ః జర్మనీలోని యాంటి ప్రోటాన్ యాండ్ ఐరెన్ రీసెర్చ్ సంస్థ రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్‌లో ఉన్న ఈసీఐ ఎల్‌తో ఒప్పందం కుదుర్చు కుంది. దీని మేరకు పవర్ కన్వర్టర్లను ఈసీఐఎల్ జర్మనీ సంస్థకు అందించనుంది. ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు.
-సెప్టెంబర్ 9 ః రాష్ట్రంలోని నిమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించేం దుకు రూ 100 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. మరో రూ 125 కోట్లతో కర్నూలు, విశాఖపట్నంలలో ప్రాంతీ య కేంద్రాలను ప్రారంభిం చనున్నట్లు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.
-సెప్టెంబర్ 10 ః జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సభ్యుడు దుగ్గల్, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అధికారులతో చర్చించారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలో నిర్మించనున్న తుఫాను పునరావాస కేంద్రాలను 2015 నాటికి పూర్తి చేయాలని సూచించారు.
-సెప్టెంబర్ 12 ః హైబ్రిడ్ వరిని ప్రోత్సహించడం, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుసరించడం.. తదితర అంశాలు హైదారాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో వ్యక్తం అయ్యాయి. సెప్టెంబర్ 10, 11, 12 తేదీలలో ఈ సదస్సు నిర్వహించారు.
-సెప్టెంబర్ 13 ః మూడో ప్రపంచ బయోటెక్నాలజీ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు.
-సెప్టెంబర్ 14 ః నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం తొలి దశను మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడులను ఈ నెల 14లోగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
క్రీడారంగం
-సెప్టెంబర్ 9 ః నేషనల్ జూనియర్ హాకీ చాంపియన్ షిప్‌లో పంజాబ్ జట్టు ఒడిశాను ఓడించింది. ఫైనల్ మ్యాచ్ లక్నోలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో నిర్వహించారు.
-సెప్టెంబర్ 10 ః అమెరికా టెన్నీస్ క్రీడాకారుడు అండ్రి అగస్సి అమెరికా ఓపెన్ కోర్ట్ ఆఫ్ చాంపియన్స్ జాబితా లో చోటు దక్కించుకున్నాడు.
-సెప్టెంబర్ 12 ః ఈజిప్ట్‌కు చెందిన ముస్తాఫా కండరాలు పెంచడంలో కొత్త రికార్డ్ సృష్టించారు. ఆయన భుజ కండరాలను 31 అంగుళాల మేర పెంచాడు. 2013 గిన్నీస్ బుక్‌లో ముస్తాఫా పేరును చేర్చనున్నారు.
-సెప్టెంబర్ 13 ః చైనా మాస్టర్స్, బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు మంచి ప్రతిభ చూపింది. ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉన్న బురానా ప్రసేర్‌త్సుక్‌ను ఓడించి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
ఆర్థికం
-సెప్టెంబర్ 10 ః రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆర్థిక రంగానికి సంబం ధించి పలు సలహాలు ఇచ్చారు. రాయితీలను స్థుల దేశీయోత్పత్తిలో 2% పరిమి తం చేస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.
-సెప్టెంబర్ 11 ః 21 విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులకు ప్రభుత్వం ఆవెూదం తెలిపిం ది. ఇందులో ఎనిమిది ఔషధ రంగానికి చెందినవి ఉన్నాయి. ఈ నిర్ణయంతో దేశంలోకి రానున్న మొత్తం విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల విలువ రూ 2,410 కోట్లు.
-సెప్టెంబర్ 12 ః జులై నెలకు సంబంధిం చిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను విడుదల చేశారు. జులై నెలలో వృద్ధి రేటు 0.1%గా నవెూదు అయింది.
-సెప్టెంబర్ 13 ః రూ 1,87,127 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోడానికి కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను లీటరుకు రూ 6 మేర పెంచింది. రాయితీపై ఇచ్చే ఇచ్చే సిలిండర్ల సంఖ్యను ప్రతి కుటుంబానికి 6కు తగ్గించారు.
-సెప్టెంబర్ 14 ః మందగమనంతో కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మల్టీ బ్రాండ్‌లో 51%, సింగిల్ బ్రాండ్‌లో 100%, పౌర విమానయాన రంగంలో 49% విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిచ్చింది.
సైన్స్ & టెక్నాలజీ
-సెప్టెంబర్ 9 ః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 100వ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ-21 ద్వారా ఫ్రెంచ్ ఉపగ్రహం స్పాట్-6, జపాన్‌కు చెందిన ప్రాయిటెరీస్‌లను నిర్ధేషిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఇస్రో 62 ఉపగ్రహాలను, 38 రాకెట్లను, 28 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
-సెప్టెంబర్ 13 ః ‘ఐలెట్’ కణాల మార్పిడి ద్వారా టైప్-1, టైప్-3 మధుమేహ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని హైదరాబాద్‌లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటిరాలజీ వైద్యులు ప్రకటించారు.
అంతర్జాతీయం
-సెప్టెంబర్ 16 ః దేశ రక్షణ మంత్రి ఏకే ఆంటోని మూడు రోజుల పర్యటన నిమిత్తం మాల్దీవు లకు చేరుకున్నారు. ఆ దేశంలోని మాలేలో ‘సేనహి యా’ పేరుతో ఒక ఆసు పత్రిని ప్రారంభించారు. భారతదేశం అందించిన సహాయంతో ఈ ఆసుపత్రి నిర్మించారు.
-సెప్టెంబర్ 17 ః భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్ బాబర్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అణ్వాయుధాలను వెూసుకెళ్లే సామర్ధ్యం దీనికి ఉంది. 700 కిలోమీటర్ల మేర వెళ్లగలదని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. బాబర్ క్షిపణికే హాతాఫ్7 అని మరో పేరు కూడా ఉంది. ఈ పరీక్ష ఎక్కడ నుంచి నిర్వహించిందో పేర్కొనలేదు.
-సెప్టెంబర్ 19 ః జపాన్ కొత్త ఇంధన విధానాన్ని ఆవెూదించింది. అణువిద్యుత్తుపై ఆధారపడే అంశం గణనీయంగా తగ్గించేందుకు ఉద్దేశించిందే ఈ బిల్లు. గతేడాది సంభవించిన సునామీ తర్వాత పుకుషిమా అణు రియాక్టర్ మూలంగా జపాన్ తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా ఆ దేశంలోని 50 అణు రియాక్టర్లలో 48 మూతపడ్డాయి. పుకుషిమాను కూడా ఇటీవలే పునరుద్ధరించారు.
-సెప్టెంబర్ 20 ః మయన్మార్ ఉద్యమనేత, నోబెల్ అవార్డ్ గ్రహిత అంగ్‌సన్ సూకికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా ప్రభుత్వం సూకికి ‘కాంగ్రెషనల్ గోల్డ్‌మెడల్’ అవార్డ్‌ను బహుకరించింది. విదేశీయులకు ఈ అవార్డ్ అరుదుగా ఇస్తారు.
జాతీయం
-సెప్టెంబర్ 15 ః బొగ్గు కుంభకోణంపై వేసిన ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ కొత్త సిఫారసులు చేసింది. ఈ గ్రూప్‌నకు జోహ్రా - చటర్జీ నేత్రుత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలు బొగ్గు అనుమతుల రద్దుకు సిఫారసులు చేసిన ఐఎంజీ..... తాజాగా మరో రెండు అనుమతుల రద్దుకు సిఫారసు చేసింది.
-సెప్టెంబర్ 16 ః దేశంలోఉన్నత విద్య ప్రమాణాలను పెంచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నడుం బిగించింది. తన పరిధిలోకి వచ్చే అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు అక్రిడిటి యేషన్‌ను తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని యూజీసీ భావిస్తోంది.
-సెప్టెంబర్ 20 ః భారత్ సందర్శిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశం అయ్యారు. శ్రీలంకలో తమిళులు ఎక్కు వగా ఉన్న ఉత్తర ప్రాంతం లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాజపక్సే చెప్పారు.
రాష్ట్రీయం
-సెప్టెంబర్ 15 ః వ్యాయామ శిక్షణలో పేరొందిన దినాజ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించింది. ఒకేసారి 6,671 మందికి వ్యాయమ శిక్షణ ఇచ్చి దినాజ్ ఈ ఘనత సాధించారు. 45 నిమిషాల పాటు కొనసాగిన శిక్షణలో మధ్యలోనే 500 మంది వైదొలిగినా చివరి వరకు 6,671 మంది కొనసాగారు.
-సెప్టెంబర్ 19 ః తెలుగు భాషను సామాన్యుల దాకా తీసుకెళ్లిన కవి గురజాడ జయంతిని ఆధునిక సాహిత్య దినోత్సవంగా నిర్వహించా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరంలో నిర్వహించిన గురజాడ జయంత్యుత్సవాల్లో భాగంగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు ప్రకటన చేశారు.
-సెప్టెంబర్ 20 ః ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మీసేవకు గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ఈ పథకానికి స్కోచ్ సంస్థ అవార్డ్‌ను ప్రకటించిందని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. అవార్డ్‌ను కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అందజేశారు.
ఆర్థికం
-సెప్టెంబర్ 15 ః ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన ప్రణాళిక సంఘం సమావేశంలో 12 ప్రణాళిక మూసాయిదాను ఆవెూదించారు. ఈ ప్రణాళిక కాలం 2012-17. వార్షిక సరాసరి ఆర్థిక వృద్ధిని ప్రణాళిక సంఘం మార్పు చేసింది. గతంలో తొమ్మిది శాతంగా నిర్ధేశించినా దీనిని తాజాగా 8.2 శాతానికి తగ్గించారు.
-సెప్టెంబర్ 17 ః రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక పరపతి విధానాన్ని సమీక్షించింది. నగదు నిల్వల నిష్పత్తి (క్యాష్ రిజర్వ్ రేషియో, సీఆర్‌ఆర్)ను 4.75 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గించింది. ఫలితంగా బ్యాంకులకు అదనంగా రూ 17,000 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచాల్సిన డిపాజిట్లనే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. రెపోరేట్, రివర్స్ రెపోరేట్, ఎస్‌ఎల్‌ఆర్‌లలో మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి మార్పులు తీసుకురాలేదు.
-సెప్టెంబర్ 15 ః భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కొహ్లీ ‘ఓడీఐ (వన్‌డే ఇంటర్నేషనల్) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. అలాగే శ్రీలంకకు చెందిన కుమార సంగక్కరా ఏకంగా మూడు అవార్డులు దక్కించుకున్నారు. క్రికెటర్ ఆఫ్ ది ఇయ్యర్‌తో పాటు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్‌ను కూడా కుమార సంగక్కరా అందు కున్నారు.
-సెప్టెంబర్ 17 ః అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్) తాజా ర్యాంక్‌లను విడుదల చేసింది. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో ప్గాని పథకాన్ని సాధించిన విజయ్‌కుమార్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు.
-సెప్టెంబర్ 19 ః ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో భారీ వాణిజ్య ఒప్పందం సైనా సెహ్వాల్
కుదుర్చుకుంది. రితి క్రీడా సంస్థతో సైనా కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ రూ. 40 కోట్లు.
సైన్స్ & టెక్నాలజీ
-సెప్టెంబర్ 17 ః భారత - అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మరో రికార్డ్ సృష్టించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భాద్యతలను ఆమె స్వీకరించారు. ఈ ఘనత సాధించిన రెండో మహిళ సునీత విలియమ్స్. కాగా తొలి మహిళ పెగ్గి వైట్సన్.
-సెప్టెంబర్ 19 ః 1000 కిలోల బరువున్న పేలుడు పదార్థాలు వెూసుకెళ్లగల అగ్ని-4 ప్రయోగాన్ని డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ఒడిశాలోని బాలాసోర్‌లో నిర్వహించారు. 4000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది చేదించగలదు.
** source from NT **

No comments:
Post a Comment