Monday, 24 September 2012

సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ పరీక్షా విధానంలో రీజనింగ్ ఎబిలిటీ విశ్లేషణ

సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ పరీక్షా విధానంలో రీజనింగ్ ఎబిలిటీ విశ్లేషణ

ఎస్‌ఐ ఆఫ్ పోలీస్ పరీక్షా విధానంలో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. పేపర్-1 (ఇంగ్లీష్), పేపర్-2 (తెలుగు) భాషా సామర్థ్యానికి చెందినవి. ఇవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్లే. వీటి మార్కులు గ్రాండ్ స్కోర్‌నందు కౌంట్ చేయబడవు. అయినప్పటికీ వీటిలో అర్హత సాధించుట తప్పనిసరి. పేపర్-3 (అర్థమెటిక్, రీజనింగ్) మరియు పేపర్-4 (జనరల్ స్టడీస్)లు ఒక్కొక్క పేపర్ 200 మార్కులకు ఉంటుంది. పేపర్-3 విషయానికొస్తే అర్థమెటిక్ మరియు రీజనింగ్ పేపర్ అభ్యర్థులకు కీలకమైనది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కొంచెం కష్టంతో కూడుకున్నది. ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువగా సాధన చేయుట ద్వారా ఈ పేపర్ నందు పట్టు సాధించవచ్చు. పేపర్-3లో ‘‘రీజనింగ్ ఎబిలిటీ’’ పై ఈ దిగువన పేర్కొనబడిన విశ్లేషణను పరిశీలించండి.



రీజనింగ్ టెస్ట్‌లో అభ్యర్థి తార్కిక సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ప్రశ్నలోని అంశాలను వేగంగా పరిశీలించి ఖచ్చితమైన సాధనను గుర్తించే సామర్థ్యం ఈ టెస్ట్‌ల ద్వారా తెలుస్తుంది. దీనిలో వెర్బల్, నాన్ వెర్బల్ అనే రెండు భాగాలుంటాయి. వెర్బల్ రీజనింగ్‌లో ప్రశ్నలు సాధారణంగా అక్షరాలు, పదాలు, అంకెలు, గుర్తులు మరియు భాషా జ్ఞానంపై ఆధారపడి ఉంటాయి.

నాన్‌వెర్బల్ రీజనింగ్‌లోని ప్రశ్నలు బొమ్మల ఆధారంగా ఇవ్వబడతాయి. బొమ్మల మధ్య ఉండే భేదాలు, పోలికలు, వాటి అమరికలను అభ్యర్థి వేగంగా తార్కికంగా గుర్తించవలసి ఉంటుంది. అభ్యర్థి మెంటల్ ఎబిలిటీని, అకడమిక్ నాలెడ్జ్‌ను సంబంధించిన టెస్టుల కంటే ఈ టెస్టులలోనే ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం కలదు. ఏ సబ్జెక్టు అయినా గణితంతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల పోటీ పరీక్షలలో అభ్యర్థి యొక్క గణిత సామర్థ్యం వేగవంతమైన గణితానువర్తన సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. రీజనింగ్ ఎబిలిటీలోని విభాగాలు పరిశీలించండి.

1. సంఖ్యాశ్రేణులు : ఈ విభాగంలో ప్రశ్నలన్నీ, నంబర్స్ మీదే ఉంటాయి. ఇందులో ప్రశ్నలు మిస్సింగ్ నంబర్, తప్పు నంబర్ ఇచ్చి గుర్తించడంలాంటివి ఉంటాయి. మరికొన్ని ఆల్ఫాబెట్ ఆధారంగా ఉంటాయి. ఉదాః
1) 2,6, 10, 14, 18, 22, 26 , ? (2)
1) 8 2) 30 3) 28 4) 32
2) C D K ? S (2)
1) p 2) R 3)Q 4)L
2. క్లాసిఫికేషన్ : ఈ ప్రశ్నలందు మొదటి దాని నుండి రెండవది, ఏవిధంగా పోలిక కలిగి ఉందో అదే విధంగా మూడవ దాని నుండి జవాబులను గుర్తించవలెను. ఉదాః
1) 5 : 25 : : 6 : ? (2)
1) 30 2) 36
3) 40 4) 50
దీని మరో రకం రెండు పదాలు ఇచ్చి, ఆ పదాల మధ్య సంబంధం కనుగొని రెండవ జంటలో మొదటి దానిని పోల్చి సమాధానం ఇవ్వాలి.
ఉదాః : కొలంబో : : జపాన్ : ______? (1)
1) టోక్యో 2)ప్యారిస్ 3) రోమ్ 4) లండన్
3. వర్గీకరణ: ఈ ప్రశ్నకు సంబంధించిన ప్రశ్నలలో ఛాయిస్‌లలో ఒకటి తప్ప మిగిలినవి ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయి. భిన్న లక్షణం కల్గిన ఆ ఒక్కపదాన్ని Odd man out అంటారు.
ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి?

ఉదాః గ్యాంగ్ టక్ : మిజోరం : చెన్నై : హైదరాబాద్ ? (2)
240 : 280 : : 300 : : : 420
(280 తప్ప మిగిలిన వన్నీ 60 యొక్క గుణిజాలు)
4. సిలైజమ్: స్టేట్‌మెంట్లు మొత్తం నాలుగు రకాలు. ఏ స్టేట్‌మెంట్ ఏ రకానికి చెందినదో గుర్తించడంతో పాటు, రెండు స్టేట్‌మెంట్లను కలిపినప్పుడు వచ్చే ఫలితం నేర్చుకుంటే సిలైజమ్ తేలిగ్గా చేయవచ్చు.
ఉదాః చాలా మంది తండ్రులు సోదరులు, అందరు సోదరులు ప్రవక్తలు ? (2)

1) ఏ తండ్రి ప్రవక్త కాదు2)కొందరు తండ్రులు ప్రవక్తలు కాదు
3) చాలామంది తండ్రులు ప్రవక్తలు
4) 2 మరియు 3.
5.క్యాలండర్ టెస్ట్ : ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీపు సంవత్సరం వస్తుంది. ప్రతీ సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మరియు ఒక odd ఉంటుంది. odd days ను సాధించాలంటే ఇచ్చిన రోజుల సంఖ్యను
‘7’ తో భాగించగా వచ్చు శేషం odd రోజుల సంఖ్య అంటారు. సూత్రం

ఉదాః X ఈ రోజు సోమవారం అయిన 235 రోజుల తర్వాత మరల ఏ వారమగును (1)

1) శుక్రవారం 2) మంగళవారం
3) సోమవారం 4) బుధవారం


వివరణ ః = కావున సోమవారం + 4 = శుక్రవారం
ఇవేకాక గడియార పరీక్ష, కోడింగ్-డి కోడింగ్ నంబర్ సీక్విన్స్ టెస్ట్, ర్యాంకింగ్ & టైమ్ సీక్వెన్స్, మిస్సింగ్ నంబర్స్, నంబర్ రిపీట్ టెస్ట్, అమరిక పరీక్ష, డైరెక్షన్ టెస్ట్, నంబర్స్ మరియు సింబల్స్, రక్త సంబంధాలు, బొమ్మల పరీక్ష, కామన్ సెన్స్ టెస్ట్ మొదలైనవి. ఈ విభాగంలో ప్రశ్నలుగా వస్తాయి.
ప్రశ్నలన్నీ లాజిక్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ విభాగాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేసి గరిష్ట మార్కులు సొంతం చేసుకోవచ్చు.

ప్రీవియస్ ప్రశ్నలు 
(ఎస్‌ఐ ఆఫ్ పోలీస్-2008)

- 2, 6, 18, 54, ___ శ్రేణిలో 1458 ఎన్నవ పదమవుతుంది? (3)

1) 5వ 2) 6వ 3) 7వ
4) 14వ 5) ఏదీకాదు.
- దీపక్ ఒక వ్యక్తిని చూపిస్తూ ఇతని ఒకే ఒక సోదరుడు తన కుమార్తె తండ్రి యొక్క తండ్రి అయితే ఆ వ్యక్తికి దీపక్‌కు మధ్య సంబంధం? (3)
1) తండ్రి 2) తాత 3) మామ
4) బావ 5) ఏదీకాదు
- 31 రోజులున్న నెలలో చివరి రోజు బుధవారం అయితే ఆ నెలలో ఎన్ని సోమ వారాలుంటాయి ? (2)
1) 4 2) 5 3) 3
4) 6 5) ఏదీకాదు
- CANE : BAMBOO : : _____? (2)
1) wood : wood keeper 2) Timber : Tree
3) Rubber : Malaysia 4) Elephant : Tusk 5) ఏదీకాదు
- ఈ క్రింది ఇవ్వబడిన అంకెల క్రమంలో 6కు ముందు లేదు 7కు తర్వాత ఎన్ని 5 లు కలవు? (2)
1) 1 2) 3 3) 2 4) 4 5) 5


** source from NT **

No comments:

Post a Comment