Tuesday, 25 September 2012

సబ్‌ఇన్‌స్పెక్టర్


సబ్‌ఇన్‌స్పెక్టర్ రాతపరీక్షలో భాషా సామర్థ్య పేపర్ కీలకం.
ఈ పేపర్‌లో ఇంగ్లిష్, తెలుగు భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. కేవలం ఈ పేపర్ అర్హతకు ఉద్దేశించిందే అయినప్పటికీ ఇందులో క్వాలిఫై కాకపోతే మిగతా పేపర్లలో అత్యధిక మార్కులు
సాధించినా నిరుపయోగమే.


ఎస్.ఐ. రాత పరీక్షలో ఇంగ్లీష్‌ను పేపర్-1గా ఇస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. కాని ఈ పేపర్ జాబ్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలో అభ్యర్థుల జనరల్ ఇంగ్లీష్ సామ ర్థ్యాన్ని పరీక్షించడం కోసమే వీటిని ప్రవేశపెట్టారు.



100 మార్కులు కల్గిన ఈ పేపర్‌లోని ప్రశ్నలకు సమాధానాలు డిస్క్రిప్టీవ్ పద్ధతిలో రాయాలి. ఇంగ్లీష్ వాక్య నిర్మాణాల గురించి అవగాహన కలిగి ఉంటే సమాధానాలను సులభంగా రాయవచ్చును. దాదాపు 7 రకాలైన విభాగాలపై ప్రశ్నలు ఉంటాయి.
si-heading
వాటి వెయిటేజి ఈ క్రింది విధంగా ఉంటుంది.
1. కాంప్రహెన్షన్ పాసేజ్ - 20 Marks
2. Precis writing - 15 Marks
3. Letter writing - 15 Marks
4. Paragraph writing - 10 Marks
5. Essay writing - 20 Marks
6. Report writing - 10 Marks
7. Translation (English to Telugu)
writing - 10 Marks

1. కాంప్రహెన్షన్ ప్యాసేజ్
ఈ విభాగాన్ని అభ్యర్థి రీడింగ్ స్కిల్‌ను పరీక్షించడానికి ఇస్తారు. దీనికి సులభంగా జవాబులు వ్రాయాలంటే మొదట ఇచ్చిన ప్యాసేజ్‌ను ఒకటికి రెండుసార్లు చదవాలి. అప్పుడు దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి సమాధానాలు వ్రాయడం సులభమవుతుంది. సమాధానాలను వ్రాసేటపుడు వాక్య నిర్మాణంలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.

2. Precis writing
Precis writing అనగా మన సొంత పదాలలో వ్రాసే ఒక రకమైన summarisation ఇచ్చిన సమాచారాన్ని 2 నుండి 3 సార్లు చదివి దాని యొక్క సారాంశాన్ని గ్రహించాలి. ముఖ్యమైన అంశాలను గ్రహించి వాటిని మన సొంత పదాలలో రాయాలి. సరైన క్రమంలో వ్రాయాలి. Direct Speech లో ఉన్న అంశాలను Indirect Speech లోని మార్చి వ్రాయాలి. వీలైతే Clause లను Phrase లుగా, Phrase లను పదాలుగా మార్చి వ్రాస్తే passage నిడివి తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించిన Examples ను తొలగించాలి. ఇచ్చిన passage లో one-third (1/3) వ వంతుగా వ్రాసి దానికి తగిన టైటిల్ సూచిస్తే సరిపోతుంది.

3. Letter writing
ఇది చాలా సులభంగా మార్కులు పొందే విభాగం. ముందుగా ఇచ్చిన ప్రశ్న Official letter కు సంబంధించినదో లేదా personal letter కు సంబంధించినదో తెలుసుకోవాలి. ఆ తర్వాత letter లోని భాగాలైన Heading, Salutation. Body of the letter, leave taking Address లను సరైన స్థానాల్లో రాయడం తెలుసుకోవాలి. ఆ తర్వాత వీటిని రాసేటప్పుడు Punctuation marks అయినటువంటి Full Stop, Comma లను అవసరమైన చోట ఉపయోగించాలి. దాదాపుగా లెటర్‌ను ఒక పేజిలోనే ముగిస్తే మంచిది. లెటర్‌లోని ప్రతి భాగానికి మార్కుల వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి అన్ని భాగాలను సరైన క్రమంలో, సరైన స్థానాల్లో రాస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంది.

4. Paragraph writing

దీనిని ఒక చిన్నపాటి Essay గా భావించవచ్చు. ఈ విభాగాలో 2 లేదా 3 ప్రశ్నలను ఇచ్చి దానిలో ఒక దానికి జవాబు రాయమని అడగవచ్చు. దీనిలో సామే తలను లేదా విశ్వసత్యాలను ఇచ్చి parargraph గా రాయమనవచ్చు. లేదా ఒక్కొక్కసారి కొన్ని పదాలను ఉపయోగించి సన్నివేశంగా మలచమని అడగవచ్చు. ఏదైనా ఇచ్చిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని ఒక paragraph గా విస్తరించి రాయాలి. Pararagraph లో రాయబోయే వాక్యాలు ఇచ్చిన అంశానికి సంబంధించినవై ఉండి వాటిని క్రమపద్ధతిలో 10-12 వాక్యాలకు మించకుండా రాస్తే సరిపోతుంది.

5. Essay writing
అభ్యర్థి యొక్క పూర్తి ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విభాగం ఇది. అడిగే అంశాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. Terrarism, World peace, National Integration, Patriotism, Natural Calamities, Population etc., Essay రాసేటప్పుడు essay కు ఉండే లక్షణాలను మరవకుండా 250-400 పదాల వరకు ఉపయోగించి రాయాలి.
(i) Focus :- ఒక మంచి Essay clear cut గా ఉండి central idea ను కల్గిఉండాలి. వ్యాసంలో రాయబోయే ప్రతి paragraph ఒక main point / Topic ను కల్గిఉండాలి.
(ii) Development :- ప్రతి paragraph, main idea ను ఉటంకిస్తూ దానిని విస్తరిస్తూ రాయాలి. Paragraph లో రాయబోయే వాక్యాలు Central ideaకు అనుబంధంగా ఉండాలి.
(iii) Unity :- వ్యాసంలోని ప్రతి paragraph, main idea కు related ఉండి ఒకదానికొకటి సంబంధం కల్గిఉండేలా చూసుకోవాలి.

(iv) Coherence :- అన్ని అంశాలను లాజికల్‌గా ఆర్గనైజ్ చేసుకొని, అర్థవంతమైనదిగా రాయడమే. ఎస్సే రాసేటప్పుడు పై అంశాలను దృష్టిలో ఉంచుకొని గ్రామర్ తప్పులు లేకుండా రాయగలిగితే మంచి మార్కులను పొందవచ్చు.

6. Report writing 
Report writing అనగా Report of an incident/event after investigation or consideration. Report writing లో Report Factual Information (వాస్తవమైన సమాచారం) ను ఇవ్వాలి. Report లో సొంత అంశాలను, సొంత Comments ను చేర్చకూడదు. సవవివరమైన Report ను రాయగలిగితే సరిపోతుంది. Report writing లో అభ్యర్థి కొన్ని అంశాలను తప్పకుండా రాయాలి. అవి a) Head/topic at the top b) Name of the Report below the heading c) Name of the Reporting place d) Date below the Reporting place.

7. Translation 
(English & Telugu)
ఈ విభాగంలో మార్కులు పొందటం చాలా సులభం. ఇచ్చిన సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చదివి దాని సారాంశాన్ని తెలుగులోనికి అనువదించారు.
- మొత్తం మీద మంచి మార్కులు పొందాలంటే ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌ను చదవడం అలవాటు చేసుకోవాలి.
- ఒక మంచి గ్రామర్ పుస్తకాన్ని తీసుకొని గ్రామర్ రూల్స్‌ను తెలుసుకుంటే మంచిది.
- వివిధ అంశాలకు సంబంధించిన Terminology (vocabulary) నేర్చుకోవాలి.
- తప్పులు లేకుండా రాయడం నేర్చుకుంటే మంచి మార్కులు పొందవచ్చు.
సబ్జెక్టు నిపుణులు ః నైస్ ఇనిస్టిట్యూట్,
నల్గొండ ఫ్యాకల్టీ.

Report writing 
In Writing a report, you have to keep the following points in mind

- The number of words may not be specified in Report writing paper. However, your report should neither be too long or too short. Ideally a report should be of 500 words. Even in newspapers like the Times of India and the Hindustan Times. You will notice that even the lengthiest reports are not morethan 750 words.

- In reports, You will notice that the introduction to the subject matter is not very long. Introduce the subject in the opening line itself. That is, your introduction should not be of more than one line.

- Report writing is always done in he present tense, although within the report itself reference to the past or future may be given.

- Reporting is always direct. You must write your report as if you are directly witnessing the scene, Or, as if you have directly studied a phenomena. However, references and statements of other persons within the reports may be quoted under inverted commas.

- In writing the reports remember never to use the first person I, If at all you feel the need to use I, You may use this reporter instead. For example : instead of using. I found the scene at the accident site pathetic, it is better to use This reporter found the scene at the accident site pathetic

- In writing reports it is always advisable to provide a heading or topic to the report, if it has not been specifically asked for in the question.

Format of report : Generally, the accepted format in a report is :
(1) Heading or Topic at the top.
(2) Name of the reporter below the heading (Sometimes, the reporters name is also seen at the end of the report)
(3) Name of the place from where reporting is being done.
(4) The name of the place is followed by data line.
TOPIC / HEADING
REPORTERS NAME
DATE
Place Name

MAIN BODY OF THE REPORT

- Different newspapers follow different format of reporting. However, the students are advised to follow the standard format.
- It is also advised to write xyz in place of the reporters name of your actual name in writing the report.
- Now we shall take up some examples of report writing. Read these reports carefully as they represent diverse areas.

** source from NT **

No comments:

Post a Comment